English   

గత ఆదివారం చిరంజీవి సర్జ.. ఈ ఆదివారం సుశాంత్ సింగ్ రాజ్ పుత్..

chiranjeevi Sarja Sushant Singh
2020-06-15 11:30:11

ఇద్దరూ ఇండియన్ సినిమాలో వాళ్ల వాళ్ల ఇండస్ట్రీలలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు.. ఇద్దరి వయసు 30 లోనే ఉంది.. అభిమానులు కోట్లలో ఉన్నారు.. ఎంతో భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తుంది.. మరో రెండు దశాబ్దాలు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పే సత్తా ఉన్న నటులు.. కానీ ఒకే ఒక్క వారం వ్యవధిలో ఇద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రెండు ఆదివారాలు అభిమానులను శోకసంద్రంలో ముంచేశాయి. అందులో ఒకరు కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా.. మరొకరు బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్. కన్నడలో దాదాపు 20 సినిమాల్లో నటించి.. అందులో 12 సినిమాలు విజయాలు.. మూడు సినిమాలు సేఫ్ ప్రాజెక్టులు అందుకున్న చిరంజీవి సర్జా కేవలం 39 ఏళ్ల వయసులో గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. 

జూన్ 7న గత ఆదివారం ఆయన చనిపోయాడు. చిరంజీవి సర్జా మృతి సౌత్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈయన యాక్షన్ కింగ్ అర్జున్ కి స్వయాన మేనల్లుడు. ఇప్పటికీ ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతలోనే మరో ఆదివారం వచ్చింది.. మరో స్టార్ హీరోను మనకు కాకుండా చేసింది. కేవలం 34 ఏళ్ల వయసున్న సుశాంత్ సింగ్ మానసిక ఒత్తిడి కారణంగా జూన్ 14న ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ మరో విషాదం ఏంటంటే గత ఆదివారం చిరంజీవి సుమారుగా ఏ సమయానికి అయితే చనిపోయాడో.. ఈ ఆదివారం అదే సమయంలో సుశాంత్ మరణించాడు. ఇందులో ఒకరు హఠాన్మరణం.. మరొకరు బలవన్మరణం. కారణం ఏదైనా ఇద్దరు మంచి నటులు ఇండియన్ సినిమాకు దూరం కావడం అనేది అభిమానులు నమ్మలేకపోతున్నారు. 

More Related Stories