English   

నానికి ఏమయింది...ఆ సీక్వెల్ ఎందుకు నిర్మించట్లేదు 

 Vishwak Sen hit 2
2020-06-15 12:51:19

న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నాని గతంలో ‘అ !’ అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే అ! సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోవటంతో వెంటనే మరో సినిమాను నిర్మించలేదు. అయితే గత ఏడాది విశ్వక్ సేన్ తో హిట్ అనే సినిమా చేయగా దానికి మంచి పేరుతో పాటు మంచి కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమాకి మరో సీక్వెల్ రావచ్చని సినిమా రిలీజ్ సమయంలోనే హింట్స్ ఇచ్చారు మేకర్స్. అయితే అది ఇంకొన్నేళ్ళు పట్టచ్చేమో అనుకున్నారు. అయితే ఎవరికీ అనుమానమే రాకుండా ఈ సినిమా షూట్ కూడా మొదలయిపోయిందని చెప్పి షాకిచ్చారు మేకర్స్. ఈ విష‌యాన్ని విశ్వక్‌ సేన్‌ స్వయంగా ప్రకటించారు. ప్ర‌స్తుతం తాను హిట్‌-2, పాగ‌ల్ సినిమాల్లో హీరోగా న‌టిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే అందరూ అనుకున్నట్టు ఈ సీక్వెల్ నాని నిర్మాణ సంస్థ వాల్‌పోస్ట‌ర్‌లో కాకుండా మ‌రో బ్యాన‌ర్ ద్వారా రూపొంద‌నున్న‌ట్లు చెబుతున్నారు. అది ఎందుకు అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.  

More Related Stories