కరణం మల్లీశ్వరిగా లస్ట్ స్టోరీస్ భామ

విక్కీ కౌశల్, కియారా అద్వానీ, మనీషా కోయిరాలా, భూమి ఫడ్నేకర్, సంజయ్ కపూర్, రాధికా ఆప్టే లాంటి నటీనటులు నటించిన ‘లస్ట్ స్టోరీస్’ తొలి భాగం గత ఏడాది జూన్ 15న రిలీజయి ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఈ సిరీస్ ను తెలుగులో తెరకేక్కిస్తారని అనుకున్న అదంతా ఏమీ లేదని తేలిపోయింది. అయితే ఈ వర్షన్ అంతా తెలుగులో కూడా ఉండడంతో తెలుగులో కూడా ఈ సిరీస్ బాగా ఫేమస్ అయిందని చెప్పచ్చు. అయితే అందులో నటించిన భూమి ఫడ్నేకర్ కు తెలుగులో ఒక బయోపిక్ ఛాన్స్ వచ్చినట్టు చెబుతున్నారు. అదేంటంటే మొన్నీమధ్య తెలుగులో ఎపీకి చెందిన ప్రముఖ నేషనల్ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవితాధారంగా సినిమా చేస్తున్నట్టు ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రకటించారు.
సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మల్లేశ్వరి పాత్రలో తొలుత నిత్యమీనన్ ని అనుకున్నా ఆమె ఈ సినిమా చేయలేనని చెప్పిందని అంటున్నారు. అందుకే ఈ పాత్రలో నటి భూమి ఫడ్నేకర్ పేరు తెరపైకి వచ్చింది. భూమి ఫడ్నేకర్ కు ఎటువంటి పాత్రల్లోనైనా ఇమిడిపోగలదని కూడా పేరుంది. గ్లామర్ పాత్రలో నటించడానికి అలాగే పనిమనిషి పాత్రలోనూ నటించి మెప్పించగలనని నిరూపించుకుంది. అందుకే భూమిని మేకర్స్ సంప్రదించారట. అందుకు ఆమె కూడా ఒప్పుకుందని చెబుతున్నారు. ఇక షూటింగ్స్ కి కూడా పర్మిషన్స్ వచ్చేయడంతో వీలయినంత వరకూ ఈ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.