English   

సుశాంత్ ఫోటోలు డిలీట్ చేయండి...పోలీసుల వార్నింగ్

Sushant Singh Rajput
2020-06-15 13:09:17

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన దాదాపు అందరినీ కలవరపరిచింది. చాలా చిన్న వయసులో ఆయన చేసుకున్న ఈ పనిని ఎంతో మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన చనిపోయాక మంచం మీద పడుకోపెట్టి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం మీద మహారాష్ట్ర పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 

సుశాంత్ డెడ్ బాడీ ఫోటోలను ఎవరూ షేర్ చేయవద్దని కోరిన వారు ఒకవేళ ఇప్పటికే అలా చేస్తే డిలీట్ చేయాలని లేదంటే వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఆయన అభిమానులు సైతం ఇలా నిర్జీవంగా ఆయనున్న ఫోటోలు పెట్టవద్దని కోరుతున్నారు. నటుడు సోనూసూద్ సైతం నెటిజన్లకు ఇదే అభ్యర్ధించారు. ఎంఎస్ ధోని సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ మొదట కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ సినిమా తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు. ఇలా చిన్న వయసులో మంచి నటుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు.  

More Related Stories