English   

ప్రభాస్ సినిమా కోసం ఫిలిం సిటీలో భారీ సెట్ లు 

Prabhas
2020-06-15 16:41:46

ప్రపంచ దేశాల మీద కరోనా దెబ్బ మామూలుగా లేదు. ఎన్నో దేశాలు షట్ దౌన్ అయ్యాయి. దేశాలు ఇప్పట్లో అయితే కోలుకునే పరిస్థితి అయితే లేదు. ఇక దేశాలే ఇలా ఉంటె ఇక సినిమాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. అందరూ ముందు కొంత లైట్ తీసుకుని షూటింగ్ లు చేసినా పరిస్థితి తీవ్రత అర్ధం అయ్యాక అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏకంగా ఎక్కడో జార్జియాలో షూట్ చేసుకు వస్తామని వెళ్ళిన ప్రభాస్ రాధే శ్యాం యూనిట్ కూడా అన్ని ఆపేసి మధ్యలోనే భయపడి వచ్చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపులుతో మళ్ళీ షూట్ లు చేసే పనిలో పడ్డారు. 

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ యూనిట్ మాక్ షూట్ నిర్వహించే పనిలో ఉండగా, ఇప్పుడు ప్రభాస్ సినిమా షూటింగ్ అప్డేట్ కూడా బయటకి వచ్చింది. పీరియాడిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌ గ నటిస్తోన్న సంగతి తెల్సిందే. క‌రోనా ఎఫెక్ట్‌కు ముందు ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను జార్జియాలో చిత్రీక‌రించగా ఇప్పట్లో మళ్ళీ ఆ దేశం వెళ్ళే అవకాశం లేదు. అందుకే ఆ దేశంలో షూట్ చేసిన ప్రాంతపు సెట్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేస్తున్నార‌ట‌. ఈ సెట్ ఖరీదు దాదాపుగా 20 కోట్ల దాకా ఉండవచ్చని అంటున్నారు. క‌రోనా దెబ్బకు ఈ సినిమా మొత్తాన్ని ఇక హైద‌రాబాద్‌లోనే సెట్స్ వేసి చిత్రీక‌రించాల‌ని అనుకుంటున్నార‌ని చెబుతున్నారు.  

More Related Stories