English   

నంది అవార్డుల ఈ విషయంలో సైరా, యాత్ర మధ్య రగడ..

sye raa and yatra
2020-06-16 08:12:36

ఒకప్పుడు ప్రతీ సంవత్సరం పద్ధతిగా ఇచ్చే నంది అవార్డులు కొన్ని సంవత్సరాలుగా కనిపించడం లేదు. చివరగా 2015 తర్వాత ఇప్పటివరకు మళ్లీ నంది అవార్డుల ప్రకటన జరగలేదు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ అవార్డుల గురించి అసలు పట్టించుకోవడం లేదు. దాంతో మొన్న జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి దృష్టికి నంది అవార్డుల విషయం తీసుకొచ్చారు సినిమా పెద్దలు. ఇదే విషయాన్ని చిరంజీవి మీడియా ముందు కూడా చెప్పాడు. త్వరలోనే నంది అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు అంటూ ఆయన మీడియాకు తెలిపాడు. ఇక్కడే అసలు స్టోరీ బయటికి వస్తుంది. 2019లో రెండు సినిమాల మధ్య యుద్ధం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే సైరా నరసింహారెడ్డి, యాత్ర. ఒకటి స్వాతంత్ర సమరయోధుడు జీవిత చరిత్ర.. మరొకటి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర.

ఈ రెండు సినిమాల మధ్య నంది అవార్డుల విషయంలో కచ్చితంగా రగడ జరగడం ఖాయం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఉన్నాకూడా అది ఫ్లాప్ అయ్యింది. పైగా అది తెలుగుదేశం సినిమా అని ప్రచారం జరిగింది. దానికి నంది అవార్డులు వస్తాయని అనుకోవడం కాస్త అత్యాశే అవుతుంది. ఇలాంటి సమయంలో ప్రధాన పోటీ చిరంజీవి సైరా నరసింహారెడ్డి, యాత్ర సినిమాల మధ్య ఉండబోతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఇదే జరిగితే ఉత్తమ నటుడు చిరంజీవి.. ఉత్తమ చిత్రం యాత్రకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అలా కుదరని పక్షంలో ఉత్తమ నటుడు మమ్ముట్టి.. ఉత్తమ చిత్రం సైరా నరసింహారెడ్డికి ఇచ్చే ఆలోచన కూడా ఉంది. అలా కాకుండా స్పెషల్ జ్యూరీలో కూడా యాత్రకు అవార్డులు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా భారీ గ్యాప్ తర్వాత ఈ ఇవ్వబోయే నంది అవార్డులు కచ్చితంగా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. 
 

More Related Stories