English   

సుశాంత్‌ను చంపేసింది వాళ్ళే..పాత ట్వీట్స్ తవ్వుతున్న అభిమానులు

 Sushant Singh Rajput
2020-06-16 12:11:44

సాధారణంగా సక్సెస్ లో ఉన్న స్టార్స్ వెనక అందరూ పడతారు. హీరో వరుస హిట్లు కొడుతుంటే ఆయనకు అందరూ కావాల్సిన వాళ్లే. కానీ విచిత్రంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో మాత్రం ఎందుకో ఇది నిజం కాలేదు. కెరీర్ లో అన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నా కూడా ఆయనను మాత్రం బాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు కొందరు హీరోలు అంతగా పట్టించుకోలేదని అగ్ర నిర్మాతలు అయితే ఆయన్ని తమ సినిమాల్లో నటించకుండ బ్యాన్ చేశారని అంటున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్‌లో నెం.1 సినీ విమ‌ర్శకుడిగా త‌న‌ను తాను భావించే క‌మ‌ల్ ఆర్.ఖాన్ ట్విట్ట‌ర్ ద్వారా ఫిబ్రవరిలో ప్రకటించారు.

విశ్వనీయ సమాచారం ప్రకారం ధర్మా క్రియేషన్స్( కరణ్ జోహార్), సాజిద్ నడియవలా, యష్ రాజ్ ఫిలిమ్స్, టీ సిరీస్, సల్మాన్ ఖాన్, దినేష్ విజయన్, బాలాజీ లాంటి సంస్థలు సుశాంత్ ని తమ సినిమాల్లో తీసుకోకుండా నిషేదిన్చారని చెబుతూ ఇక అయన సీరోయల్స్ చేసుకోవచ్చని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనిని అభిమానులు ఇప్పుడు నమ్ముతున్నారు. ఆయనని పట్టించుకుని ఉంటే.. మిగిలిన హీరోల మాదిరిగా ఆయనను కూడా ట్రీట్ చేసి ఉంటే ఈరోజు ఒక అనాధ అలా చనిపోవాల్సిన అవసరం లేదంటున్నారు. 

ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నాడు సుశాంత్. తన మిగిలిన హీరోల మాదిరి ఏ పార్టీలకు ఎవరు పిలవరని.. తనతో ఎవరూ కలివిడిగా ఉండట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు.  ముఖ్యంగా ఇదే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ డిప్రెషన్‌కు కారణమై ఉంటుదంని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు ఆయన అభిమానులు.

అప్పుడే కాక మరో సందర్భంలోనూ ఇదే విధంగా స్పందించాడు సుశాంత్.. సినిమాలో సుశాంత్ చనిపోయే సన్నివేశం ఉండటంతో ఓ అభిమాని తాను ఆ సినిమా చూడనని చెప్పింది. అయితే అభిమాని కామెంట్ మీద స్పందించిన సుశాంత్.. `ఇండస్ట్రీలో నాకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు. అబిమానులే నాకు గాడ్‌, ఫాదర్‌. మీరు నా సినిమా చూడకపోకతే నన్ను బాలీవుడ్‌ నుంచి గెంటేస్తారు` అంటూ ట్వీట్ చేశాడు. సుశాంత్ సరదాగానే రిప్లై ఇచ్చాడని అప్పట్లో భావించినా.. ఇప్పుడు అవే కామెంట్స్ చూస్తుంటే ఆ మాటల వెనుక ఎంత బాధ ఉందొ  అర్ధమవుతుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను స్టార్స్ కొడులకు పోటీ కావోద్దనే దూరం పెట్టారని చెప్పచ్చు.  

More Related Stories