English   

సుశాంత్ ఇంట మరో విషాదం..దెబ్బ మీద దెబ్బ 

Sushant Singh Rajput
2020-06-16 13:04:43

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎందుకో కానీ ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ముంబై బాంద్రాలోని తన అద్దె ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని మరీ బలవన్మరణానికి పాల్పడటం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఇది హత్య అని కొందరు కామెంట్స్ చేయడం, అంతకు నాలుగు రోజుల ముందే ఈయనకు మేనేజర్ గా ఉండే ఒక అమ్మాయి చనిపోవడం అనేక అనుమానాలకి నెలవుగా మారింది.. అయితే ఇంతలోనే అదే ఇంటినుంచి మరో విషాద వార్త బయటకు రావడం ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలించక మానడు. సుశాంత్ వదిన అంటే ఆయన పెద్దమ్మ కొడుకు భార్య నిన్న కన్నుమూసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని తట్టుకోలేక, ఆ బాధతోనే ఆమె మరణించారని అంటున్నారు. సుశాంత్ మరణవార్త తెలిసినప్పటి నుంఛీ విషాదంలో మునిగిపోయిన ఆమె అప్పటి నుంచి ఆహారం కూడా తీసుకోవడం మానేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొన్నటి నుండి ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండడమే కాక అప్పటి నుండి ఏడుస్తూనే ఉండడంతో నీరసించిపోయి బీహార్‌ పూర్ణియాలోని తన స్వగృహంలోనే కన్నుమూసిందని అంటున్నారు. ముంబైలో సుశాంత్‌ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆమె మరణించడం సుశాంత్ కుటుంబానికి మరింత శోకాన్ని మిగిల్చిందని చెప్పచ్చు.  

More Related Stories