English   

బికినీ వేసుకుని నీతి వాక్యాలు చెబుతున్న అమలా పాల్

Amala Paul
2020-06-16 16:31:38

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన కూడా నటించిన తమిళ నటి అమలా పాల్ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ పెళ్లి చేసుకొని సినిమాలకు బై చెప్పింది. కొంతకాలం తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె రీ ఎంట్రీ నుండి పూర్తిగా గ్లామర్ షో చేస్తోంది.  అమలాపాల్ తమిళంలో ‘ఆడై’ పేరుతో తమిళ్‌లో ఒక సినిమాను చేయగా దానిని తెలుగులో ‘ఆమె’ పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో ఈ అమ్మడికి పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. దీంతో మరింత గ్లామర్ ఒలక బోసేందుకు సిద్దమయింది ఈ భామ. ఎప్పటి నుండో సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే అమాలాపాల్‌ ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది.

తాజాగా ఆమె బికినిలో ఓ చెట్టు (మంచె) పై కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫోటో తన ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పిక్ వైరల్ అయింది. ఇక పిక్ కి నీతి వాక్యాలు చెబుతూ కామెంట్ కూడా చేసింది. ‘‘కొంతమంది తమ విలువైన సమయాన్ని శాంతితో విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో యుద్ధం చేస్తుంటారు. మీరు శాంతియుతంగా జీవించడానికి ఎందుకు ప్రయత్నించరు? ప్రపంచంలో ప్రస్తుతం కొంతమంది మాత్రం అలా చేయగలరు? ప్రశాంతంగా జీవించండి..శాంతితో ఉండండి..’’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆమె తమిళ్లో ‘అధో అంధ పరవై పోలా’, ‘కాదవేర్’ సినిమాలు చేస్తుంది. ఇక మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి ‘ఆడు జీవితం’ అనే సినిమాలో నటిస్తోంది.

More Related Stories