English   

గోపీచంద్ సినిమాలో స్టార్ హీరోయిన్ 

keerthy suresh
2020-06-17 07:15:32

దర్శకుడు తేజ మొన్ననే తన పుట్టినరోజున రెండు చిత్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అలిమేలుమంగ వేంకటరమణ’, ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిల్స్‌ ప్రకటించాడు తేజ. అయితే హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఇంకెవరినీ ప్రకటించ లేదు. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ రెండు సినిమాలు రెండు రానా, గోపీచంద్‌ కథానాయకులుగా తెరకెక్కనున్నాయి. ఇదిలా ఉంటే గోపీ చంద్ తో తెరకెక్కించే ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమాలో హీరోయిన్ గా  టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ను ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఇప్పటికే ప్రాముఖ్యత ఉన్న ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ల పేర్లని కూడా తేజ పరిశీలించారని అంటున్నారు. ఈ పాత్రకు కాజల్‌, అనుష్కలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నా , ఈ సినిమా షూట్ మొదలయ్యే నాటికి కాజల్, అనుష్క ఖాళీగా ఉండి బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితిలో ఉంటారా ? అనేది అనుమానమే. ఎందుకంటే కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా కూడా ఉంది. అనుష్క కూడా నాయికా ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తోంది. ఆమె ఈ సినిమా చేస్తుందన్న నమ్మకం అయితే లేదు.  అందుకే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. 

More Related Stories