హెయిర్ కట్ కట్ చేస్తున్నహీరో ఆది పినిశెట్టి

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకి మంచి వినోదం అందిస్తున్న నటుడుగా ఆదికు పేరుంది. ఒకవైపు సపోర్టింగ్ క్యారెక్టర్లో నటిస్తూనే మరోవైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ స్పోర్ట్స్ డ్రామాలో లీడ్ రోల్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో సుమారు మూడు నెలలుగా ఆది పినిశెట్టి ఇంట్లోనే ఉంటున్నారు. చెన్నైలోని తన ఇంట్లో తల్లిదండ్రులతో ఈ సమయాన్ని గడుపుతున్నాడు ఆయన. ప్రస్తుతం బయట సెలూన్లకు వెళ్లి హెయిర్ కట్, షేవింగ్ చేయించుకోవాలంటే కరోనా టెన్షన్, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భయం అయితే వెంటాడుతూనే ఉంది. అందులోనూ వయసు పైబడిన వారు ఎమర్జన్సీ తప్ప బయటి రావోద్దన్నారు. అందుకే తన తండ్రి రవిరాజా పినిశెట్టి కోసం హెయిర్ స్టైలిస్ట్‌గా మారారు ఆది. ఆయనకు హెయిర్ కట్ చేసి, క్లీన్ షేవ్ చేసి అలా చేస్తున్న వీడియోను ట్వీట్ చేశారు. షేవింగ్ అయిపోయిన అనంతరం ఆదికి ఆయన తండ్రి 500 రూపాయలిచ్చారు.