English   

ఆగష్టులో తమిళ నిర్మాతల మండలి ఎన్నికలు

Tamil Film Producers Council
2020-06-17 11:38:39

కోలీవుడ్ లో గత ఏడాది జరిగిన నడిగర్ సంఘం ఎన్నికలు ప్రత్యక్ష్య ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోవు, గత ఏడాది ఎన్నికల ముందు అయితే విశాల్ మీద ప్రత్యర్ధి వర్గాల వారు ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఒక రేంజ్ టెన్షన్ పుట్టించారు. ఇక ఇప్పుడు మరోమారు అలాంటి టెన్షన్ మళ్ళీ క్రియేట్ అవనుంది. గత ఏడాది జరగాల్సిన నిర్మాతలు మండలి ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొందరు నిర్మాతలు మండలి కార్యాలయం మీద దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఈ ఎన్నికల వ్యవహారం కోర్టుకెక్కింది. న్యాయస్థానం తమిళ నిర్మాతల మండలికి ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అదేవిధంగా జూన్‌ 30లోపు నిర్మాతల మండలి ఎన్నికలను నిర్వహించవలసిందిగా అప్పట్లో ఆదేశించింది. 

మేలో ఎన్నికలను నిర్వహించడానికి సన్నాహాలు జగినా కరోనా వ్యాధి ప్రబలడంతో ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా నిర్మాతలు కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో కరోనా కారణాన్ని మన్నించిన కోర్టు ఎన్నికలను సెప్టెంబర్‌ 30లోగా నిర్వహించాలని ఆదేశించింది. తాజా ఆదేశాల ప్రకారం మండలి ఎన్నికలను ఆగస్టులో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి నిర్మాత మురళి, టి శివ పోటీ పడుతూ ఇప్పటికే తమ టీమ్ లను కూడా ప్రకటించారు. ఇక వీరు కాక నిర్మాత కలైపులి దాను, టీ జీ.త్యాగరాజన్, నటుడు విశాల్‌ కూడా పోటీ చేసే అవాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే విశాల్ నడిగర్ సంఘం అధ్యక్ష్యుడిగా ఉన్నారు. అయితే ఈ విషయాల మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories