English   

పుష్ప కోసం హైదరాబాద్ లో వేలవనున్న అడివి

Allu Arjun Pushpa
2020-06-17 12:34:13

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ‌న్నీ లారీ డ్రైవర్ అని ముందు నుండి ప్రచారం జరిగింది. అయితే గంధపు చెక్కల స్మగ్లర్‌ గా కనిపించనున్నాడని పుష్ప సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాని బన్నీ కెరీర్ లో మొదటిసారిగా తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో అంటే ప్యాన్ ఇండియా మూవీగా విడుదల చేయ‌నున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేప‌థ్యంలో సౌత్‌, నార్త్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్రముఖుల‌ని ఎంపిక చేశారు. ఈ సినిమా నుండి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తప్పుకున్నారని ఆయన ప్లేస్ లో బాబీ సింహాని తీసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. 

రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని గ్యాప్ లేకుండా షూట్ చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. సినిమా కథ ప్రకారం ఎక్కువగా అడవుల్లో సీన్స్ ఉంటాయి. కనుక అడవిలోనే ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ముందు బ్యాంకాక్ అనుకున్నారు కుదరలేదు, ఆ తరువాత కేరళ అనుకున్నా అదీ కుదరలేదు, చివరికి ఎపీలోని మారేడుమిల్లిలో చేయాలనుకున్న అక్కడా భయంగానే ఉంది. అందుకే పుష్ప కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అడవి సెట్టింగ్ ను వేయించబోతున్నాడట సుకుమార్. భారీ ఖర్చుతో శేషాచలం అడవులను తలపించేలా సెట్ ను నిర్మించబోతున్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.

More Related Stories