English   

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి కోరిక ఏంటో తెలుసా...

 Sushant Singh Rajput
2020-06-18 08:00:06

ఎంత మర్చిపోవడానికి ప్రయత్నించినా కూడా బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం తట్టుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఆయన తను చనిపోయే లోపు కొన్ని కలలు నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. అందులో కొన్ని ఇప్పటికే తీర్చుకున్నాడు కూడా. మరీ ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బయోపిక్ లో నటించిన తర్వాత ఆయనకు మరో కెప్టెన్ గంగూలీ బయోపిక్ లో నటించాలని కోరిక పుట్టింది. అది తన కలగా మార్చుకున్నాడు సుశాంత్ సింగ్. అందుకే ఒక మీటింగ్లో గంగూలీని కలిసినప్పుడు తన మనసులో మాట కూడా చెప్పాడు. కానీ దాదా మాత్రం దానికి నో చెప్పాడు. 

సౌరవ్ గంగూలీ తన బయోపిక్ తీయడానికి ఒప్పుకోకపోవడంతో సుశాంత్ సింగ్ కాస్త నిరుత్సాహానికి లోనయ్యారు అని ఆయన సన్నిహితులు కూడా చెబుతారు. ఇక ఇండియన్ రెజ్లర్ ఖలీ బయోపిక్‌లోను సుశాంత్ నటించాలని అనుకున్నాడు. కాని అది కుదరలేదు. ఫుట్‌బాల్ ప్లేయర్ భాయ్‌చుంగ్ భూటియా బయోపిక్ కూడా చేస్తాడని అప్పట్లో టాక్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే సుశాంత్‌తో భాయ్ చుంగ్ తెరకెక్కించేందుకు దర్శకుడు ఆనంద్ కుమార్ చర్చలు కూడా జరుపుతున్నాడని అన్నారు. కానీ అంతలోనే సుశాంత్ కన్నుమూశారు. ఏదేమైనా కూడా ఒక అద్భుతమైన నటుడు చాలా త్వరగా కోల్పోయింది ఇండియన్ సినిమా.

More Related Stories