English   

కరణ్‌ జోహార్‌  ఏక్తాకపూర్‌ సల్మాన్‌ ఖాన్‌ ల మీద కేసు

Salman Khan Ekta Kapoor
2020-06-18 08:08:24

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహర్‌, సల్మాన్‌ ఖాన్‌, ఏక్తాకపూర్‌లపై బిహార్‌ ముజఫర్‌ కోర్టులో ఈరోజు కేసు నమోదైంది. సుధీర్‌ కుమార్‌ ఓజా అనే న్యాయవాది ఈ కేసు పెట్టారు. సుశాంత్‌ ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ పిటిషన్‌లో తెలిపారు ఓజా. సుశాంత్‌ ఆత్మహత్యపై నిర్మాత కరణ్‌ జోహార్‌, సంజయ్‌లీలా భన్సాలీ, ఏక్తాకపూర్‌, సల్మాన్‌ ఖాన్‌తో పాటు మరో 8 మందిపై కేసు పెట్టారు. సుశాంత్‌ను ఉద్దేశ్యపూర్వకంగానే‌ 7 చిత్రాల నుంచి తొలగించారని, అంతేగాక అతడు నటించిన కొన్ని సినిమాలు విడుదల కానీయలేదని.. అందువల్లే ఒత్తిడికి గురై సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పిటీషన్‌లో తెలిపారు న్యాయవాది ఓజా. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం, అవమానించడం, బెదిరింపులకు పాల్పడ్డారని, దాని ప్రకారం వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలిపారు.

More Related Stories