English   

బాయ్ కాట్ బాలీవుడ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్..

Karan Johar Alia Bhatt
2020-06-18 08:14:57

మీ నెపోటీజం తగలెయ్య.. అందరూ కలిసి ఒక అద్భుతమైన నటున్ని చంపేశారు కదరా.. ఇండస్ట్రీ ఏమైనా మీ బాబులు మీకు రాసిచ్చారా లేదంటే మీరు ఏమైనా వచ్చి సొంతంగా పొడిచారా.. ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న ఆరోపణలు ఇవే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత అభిమానులు మండి పడుతున్నారు. ఆయన మరణాన్ని మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడిప్పుడే సూపర్ స్టార్ గా ఎదుగుతున్న ఒక కుర్ర హీరోను బలవంతంగా తొక్కేసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేలా చేశారు అంటూ బాలీవుడ్ లోని కొందరు సినిమా పెద్దలపై కారాలు మిరియాలు నూరుతున్నారు అభిమానులు. మరీ ముఖ్యంగా కరణ్ జోహార్, అలియా భట్ తో ఆడుకుంటున్నారు అభిమానులు. 

నెపోటీజం పేరుతో ఒక అద్భుతమైన నటుడిని ఇండియన్ సినిమాకు లేకుండా చేశారంటూ మండి పడుతున్నారు. ముఖ్యంగా బీహార్ లో అయితే ఇకపై బాలీవుడ్ సినిమాలు విడుదల కానివ్వం అంటూ భీష్మించుకు కూర్చున్నారు. సల్మాన్ ఖాన్ ఆలియా భట్ కరణ్ జోహార్ సోనమ్ కపూర్ వీళ్లు నటించిన ఏ సినిమాలు ఇకపై బీహార్లో విడుదల కావు అంటున్నారు సుశాంత్ సింగ్ అభిమానులు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోను దారుణంగా దెబ్బతీసి అందరూ కలిసి చంపేశారు అంటూ వాళ్లు వాపోతున్నారు. ఆయన మరణానికి న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం ఆగదు అంటున్నారు. మరోవైపు మిగిలిన అభిమానులు కూడా బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీని ఫలితంగా కరణ్ జోహార్ సల్మాన్ ఖాన్ సోనమ్ కపూర్ మొదలైన వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో ఫాలోవర్స్ కూడా తగ్గిపోతున్నారు. రేపు వాళ్ళ సినిమాలు విడుదలైతే కూడా మేము చూడము అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా సుశాంత్ మరణం బాలీవుడ్ లో ఉన్న దారుణాలను బయటికి తీసుకు వచ్చింది. 

More Related Stories