English   

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా కూడా ఓటీటీలోనే..

 Sushant Singh Rajput
2020-06-18 08:25:12

2019 లో విడుదలైన సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమా చిచోరే 200 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దంగల్ డైరెక్టర్ నితేష్ తివారి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంత భారీ విజయం సాధించిన తర్వాత ఏ హీరో నెక్స్ట్ సినిమా అయినా కూడా భారీ అంచనాలతో విడుదలవుతుంది. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన డ్రైవ్ సినిమా మాత్రం నేరుగా డిజిటల్ ప్లాట్ ఫాం లో విడుదలైంది. అప్పుడు లాక్ డౌన్ కూడా లేదు.. కరోనా వైరస్ అసలు లేదు. అయినా కూడా ఆ సినిమా నిర్మాత కరణ్ జోహార్ డ్రైవ్ సినిమా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల చేశారు. కారణం డిస్ట్రిబ్యూటర్లు లేకపోవడం అంటూ చూపించాడు. ఇక ఇప్పుడు సుశాంత్ లేడు.. కానీ ఆయన నటించిన చివరి సినిమా దిల్ బెచార విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమా మార్చిలో విడుదల కావాల్సి ఉన్నా కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. 

అయితే ఈ సినిమాను కూడా కొనడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదు. దానికి ఎవరు కారణం అంటే సమాధానం కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమాను కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. సుశాంత్ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లి పోవడానికి కారణం ఇది కూడా. ఎందుకంటే వరుస విజయాలు వస్తున్న సమయంలో తన సినిమాల థియేటర్లో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల కావడంతో సుశాంత్ ఆత్మస్థైర్యం బాగా దెబ్బతింది. దానికి తోడు చేతిలో ఉన్న అరడజను సినిమాలకు పైగా అన్ని క్యాన్సిల్ కావడంతో అష్ట దిగ్బంధనంలో ఇరుక్కుపోయాడు సుశాంత్. దాంతో పద్మవ్యూహంలో పడిన అభిమన్యుడిలా దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కుర్రహీరో. ఏదేమైనా ఆయన నటించిన చివరి రెండు సినిమాలు మాత్రం థియేటర్ రిలీజ్ కు నోచుకోకపోవడం దారుణం. బాలీవుడ్లో ఇంతకంటే నెపోటిజం ఎక్కడ ఉంటుంది అంటున్నారు అభిమానులు. 

More Related Stories