English   

మెగా డాటర్ కి పెళ్లి కుదిరిందా...

Niharika
2020-06-18 15:10:58

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర గ్రీన్ గాసిప్ లు ఏవైనా ఉన్నాయా అంటే ముఖ్యంగా రెండు కనిపిస్తాయి, ఒకటి ప్రభాస్ పెళ్లి కాగా, మరొకటి మెగా డాటర్ నిహారిక పెళ్లి. వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి వాళ్ళన్నా ఆలోచిస్తారో లేదో కానీ గాసిప్ రాయుళ్ళు మాత్రం గాసిప్పుల్లోనే వాళ్ళ పెళ్లి చేసేస్తారు. అదీ ఒక్కోసారి ఒక్కక్కరితో. తాజాగా మెగా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయని ప్రచారం మళ్ళీ మొదలయ్యింది. అయితే ఈ సారి ఊరికే ఈ పుకార్లు రాలేదు. తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెటిజన్లలో ఆమె పెళ్లి వార్తలపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. 

స్టార్ బక్స్ కాఫీ కప్ మీద `మిస్ నీహ` అని రాసి ఉండగా.. s కొట్టేసి..Mrs అనే దానిపై రైట్ మార్క్ వేసి పోస్ట్ చేసింది నిహారిక. అంతే కాక Mrs అనే పదం చివర క్వశ్చన్ మార్క్ కూడా పెట్టింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి `ఉహ్.. వాట్?` అని ఆమె కామెంట్ చేసింది. దీంతో కొణిదెల వారి ఇంటి నుంచి ఎప్పుడు ఆ శుభవార్త వస్తుందోనని మెగా అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఆ కుటుంబ నుండి కన్ఫర్మేషన్ వస్తే కానీ నిజమని నమ్మలేము. చూడాలి ఈ ప్రచారంలో నిజం ఎంతుంది అనేది.

More Related Stories