English   

ఆర్ఆర్ఆర్ టెస్ట్ షూట్ క్యానిల్..అందుకేనా 

SS Rajamouli
2020-06-18 17:00:26

లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేటి నుండి షూటింగ్ లు మొదలవాల్సి ఉంది. అనుమతులు అయితే వెంటాడి వేటాడి తెచ్చుకున్నా ఇప్పట్లో షూటింగ్ లు మొదలు పెట్టడానికి నిర్మాతలు సిద్దంగా లేరని వార్తలు వచ్చాయి. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కానీ లెక్కకు మించి నిబంధనలు పెట్టడమే దీనికి కారణమని అంటున్నారు. అన్ని నిబంధనలు పాటించి షూటింగ్ చేయాలంటే రెండింతలు కష్టపడాలని ఖర్చు కూడా రెండింతలు దాకా అవుతుందని నిర్మాతలు చెబుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఒక మాక్ షూట్ చేస్తున్నారని తక్కువ మంది సిబ్బందితో ఆర్ఆర్ఆర్ షూట్ ప్లాన్ చేసి 200 మందికి పైగా చేయాల్సిన షూట్ ను యాభై మందితో చేస్తారని ప్రచారం జరిగింది. 

మొన్న శుక్రవారం కానీ లేదా సోమవారం కానీ ఈ షూట్ జరగనుందని అన్నారు. అయితే జరిగినట్టు అయితే ఎక్కడా సమాచారం లేదు. అయితే అంతా సిద్ధమైనా పోలీసులు  సినిమా షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వలేదనేది చెబుతున్నారు. పోలీసులు అనుమతి ఇస్తే హైదరాబాద్ లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ మాక్ షూట్ నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. రాజమౌళి చేసే ఈ ట్రయిల్ షూట్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ ఆసక్తి గా ఎదురుచూస్తుంది. ఎందుకంటే ఆయన షూట్ చేసుకోవచ్చని సర్టిఫై చేస్తే తాము కూడా షూటింగ్ లు మొదలుపెట్టచ్చని భావిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి ఆ దిశగా వెళ్లాలని భావిస్తున్నారు. ఈ సినిమా మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్‌లోనే మిగతా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడని అంటున్నారు.  

More Related Stories