నిహారిక పెళ్లి చేసుకునేది ఎవరినంటే ..

మెగా డాటర్ నిహారిక నిన్న తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు చిన్న హింట్ ఇచ్చింది. పోస్ట్‌లో ఓ కాఫీ కప్‌పై ‘మిస్ నిహారిక’ అని రాసి ఉండగా ఆ తర్వాత దాని మీద మిస్ అనే పదాన్ని కొట్టేసి దాని కిందే మిసెస్ అని రాసి పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టింది. అంతేకాకుండా `ఉహ్.. వాట్?` అనే కామెంట్‌ను కూడా జత చేసింది. దాని మీదనే రకరకాల చర్చలు జరగ్గా ఇప్పుడు మళ్ళీ తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేసింది ఆమె. ఓ యువకుడ్ని అప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను నిహారిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్న దాన్నీ బట్టి నిహారిక వివాహాన్ని గుంటూరు జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడితో నిశ్చయించారని, ఆ యువకుడి పేరు చైతన్య అని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో లేదా ఆగస్టులోనైనా వారికి ఎంగేజ్మెంట్ చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక రెండు మూడు తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. పింక్ ఎలిపెంట్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేసింది. బహుశా ఇక ఆమె ఈ వెబ్ సిరీస్ కే పరిమితం అయిపోవచ్చు.