English   

రజనీకాంత్ ఇంట్లో బాంబు కలకలం

 Rajinikanth
2020-06-19 07:50:33

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంట్లో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. పోయిస్ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని.. అది ఏ క్షణమైనా పేలుతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి చెన్నై  కంట్రోల్ రూమ్ కి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు ఉరుకు పరుగుల మీద రజనీ ఇంటికి చేరుకొని బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో అణువణువునా గాలించారు. అయితే ఎక్కడా బాంబు ఆచూకీ లేకపోవడంతో.. ఫేక్ కాల్‌గా గుర్తించారు. అంతేకాదు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అందుకే అలా చేశాడని నిర్ధారించారు పోలీసులు. రజనీ ఇంటికి బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ రావటం  ఇది మొదటి సారి కాదు. ఇలాంటి కాల్స్ తరచూ వస్తుంటాయి. అయితే రజనీ పొలిటికల్ ఎంట్రీ, తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి కాల్స్ పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు.

More Related Stories