English   

పవన్  క్రిష్ సినిమా ఆ సీజన్ ని టార్గెట్ చేసిందా..

Pawan kalyan
2020-06-19 08:01:58

ఇక సినిమాలే లేవనుకున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలు ఒప్పుకుని చేసుకుంటూ పోతున్నారు. మూడు సినిమాల్లో క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్నారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న క్రిష్ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా అయిపోయింది. ఓ పక్క షూటింగ్ జరిగినా హీరోయిన్ గురించి మాత్రం క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో కధ ప్రకారం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందొ తెలీదు కానీ ఆ ముగ్గురిని ఎంపిక చేయడమే పెద్ద తలనొప్పిగా మారిందట క్రిష్ కి. ఆ విషయాలు పక్కన పెడితే క‌రోనా కార‌ణంగా వకీల్ సాబ్ రెగ్యుల‌ర్ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. 

ఆగ‌స్టులో పెద్ద సిన్మాల షూటింగ్స్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో `వ‌కీల్ సాబ్‌` షూటింగ్ ‌కూడా ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆ సినిమా పూర్తి అయ్యాకే ఈ సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాకి `విరూపాక్ష‌` అనే టైటిల్‌ ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదని వచ్చే ఏడాది సమ్మర్ కే ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ప‌రిస్థితులు మాత్రం ఈ సినిమా మరింత లేట్ చేసేలా ఉన్నాయి.  

More Related Stories