English   

రాజమౌళికి తలనొప్పిగా మారిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య..

RRR
2020-06-19 08:25:32

అదేంటి ఎక్కడో బాలీవుడ్ హీరో ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడ రాజమౌళికి ఎందుకు సమస్యగా మారుతుంది.. ఆయన మెడకు చుట్టుకుంటోంది అనుకుంటున్నారా.. అంతే మరి నాన్నకు ప్రేమతో సినిమాలో సుకుమార్ చెప్పినట్లు బటర్ ఫ్లై థియరీ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఎక్కడో ముంబైలో జరిగిన సుశాంత్ ఆత్మహత్య ఇక్కడ తెలుగులో రాజమౌళికి కూడా చెమటలు పట్టిస్తుంది. దానికి ప్రత్యేక కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం రాజమౌళి ఒక భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఆయన అభిమానులు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అద్భుతమైన నటుడిని బాలీవుడ్ పెద్దలంతా కలిసి ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ వాళ్లు మండిపడుతున్నారు. ఈ బాలీవుడ్ పెద్దల లిస్టులో అలియా భట్ కూడా ఉంది. 

సుశాంత్ విషయంలో చాలాసార్లు ఈమె అవమానకరంగా మాట్లాడింది. ఈ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు రాజమౌళికి తలనొప్పులు తీసుకొస్తుంది. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది.. అలాంటి మీరు తెరకెక్కించే సినిమాలో అలియా భట్ ను హీరోయిన్ గా పెట్టుకోకండి.. ఆమెను మీ సినిమా నుంచి తొలగించండి.. లేకపోతే బాలీవుడ్ లో ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామంటూ సుశాంత్ అభిమానులు రాజమౌళికి వార్నింగ్ ఇస్తున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ తలనొప్పి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే అలియా కొంతమేర షూటింగ్ చేసింది. ఈ సినిమా కోసం ఆమెకు కేవలం 10 రోజులకు గాను 5 కోట్ల పారితోషికం ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో తన సినిమాకు ఎలాంటి చిక్కులు వస్తాయో అని టెన్షన్ పడుతున్నాడు దర్శక ధీరుడు. 

More Related Stories