అఫీషియల్...నిహారిక వెడ్స్ చైతూ

చానాళ్ళ తరువాతా మెగా కుటుంబంలో పెళ్ళి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. మొన్న ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు కాఫీ కప్ తో చిన్న హింట్ ఇచ్చింది. అప్పటి నుండి ఆమె పెళ్లి గురించి రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆమె కొద్ది సేపటి క్రితం తాను పెళ్లాడబోయేది ఎవరనేది క్లారిటీ ఇచ్చేసింది.
సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన వ్యక్తే అతను, అతని పేరు చైతన్య, గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు. ఇప్పుడు నిహారిక అతనితో ఉన్న పిక్ పోస్ట్ చేస్తూ అతన్ని ట్యాగ్ చేసింది. దీంతో ఒక్కసారిగా అతనికి కూడా ఫాలోవర్స్ వెల్లువలా వచ్చి పడ్డారు. ఇక బిట్స్ పిలానీలో చదువుకున్న అయన ప్రస్తుతం టెక్ మహీంద్రా సంస్థలో పెద్ద హోదాలో ఉన్నాడు. హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసి సైలెంట్ అయిన నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ మీద ద్రుష్టి పెట్టింది. ఇక తన సోషల్ మీడియా అకౌంట్ లో చైతన్య కూడా NisChay అని కామెంట్ చేస్తూ ఇద్దరి పిక్ షేర్ చేయడంతో వీరి పెళ్ళికి కన్ఫర్మేషన్ వచ్చినట్టయ్యింది. ఇక వీరి నిశ్ఛి తార్ధ కార్యక్రమం ఆగస్టు నెలలో జరగనుంది. అనంతరం పెళ్లి వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.