మహేష్ సరసన నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చేసిన కీర్తి

ఈ యేడాది మొదట్లోనే సంక్రాంతికి మహేష్ బాబు-అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సినిమాగా మహేష్ పరుశురామ్ తో సర్కారు వారి పాట చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ముందు వంశీ పైడిపల్లి తో సినిమా ఉంటుందని అనుకున్నా కారణాలు ఏవయినా కానీ ఆ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. నిజానికి సర్కారు వారి పాట సినిమా ఇప్పటికే లాంచ్ కావాల్సి ఉన్నా అది కరోనా కుదరలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గురించి రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయిందని, ఆహా లేదు కీయరా అద్వానీని తీసుకున్నారని ఒకసారి ఇలా రకరకాల ప్రచారాలు సాగుతుండేవి, అయితే ఆ ప్రచారాలకి కీర్తి అడ్డు కట్ట వేసింది. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు కీర్తి క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయాన్ని కీర్తి స్వయంగా వెల్లడించింది. మహేష్ బాబు సినిమాలో తాను నటిస్తున్నట్లు ఆమె పేర్కొంది. కీర్తి నటించిన పెంగ్విన్ సినిమా నేడు ఆమెజాన్ లో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆమె నిన్న సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఆ సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో మహేష్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు.