ఇండస్ట్రీలో మరో విషాదం..డైరెక్టర్ ఆకస్మిక మృతి

ఈ ఏడాది ప్రపంచానికి ఏమాత్రం కలిసి రాలేదు. ఇప్పటికే కరోన అనే మహమ్మారి ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. గత రెండు మూడు నెలలోనే బాషలతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. తాజాగా ప్రముఖ మలయాళ దర్శకుడు, సచీ కన్నుమూశారు. ఇటీవల తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న సచీ త్రిస్సూర్‌లోని జూబ్లీ మిషన్ ఆసుపత్రిలో నిన్న మరణించారు. ఆపరేషన్ చేశాక గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను జూబ్లి మిషన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే, చికిత్సకు ఆయన శరీరం స్పందించక పరిస్థితి విషమించి కన్నుమూశారు. 2015లో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సచీ పూర్తిపేరు కేఆర్ సచ్చిదానందన్. పృథ్వీ రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘అనార్కలి’, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాలు ఈయన తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల్లో ‘అయ్యప్పనుమ్ కొషియుం’ మంచి పేరు తెచ్చుకుంది.