English   

మూడు రోజుల ముందే స్టాఫ్ కి సుశాంత్ డబుల్ జీతాలు

Sushant Singh
2020-06-19 23:59:36

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై జరుగుతున్న పోలీసుల విచారణలో ఆసక్తి కర విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇప్పుడు సుశాంత్‌ స్టాఫ్‌, స్నేహితులు, కుటుంబసభ్యులను పోలీసు అధికారులు విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి మూడు రోజుల ముందు సుశాంత్‌ తన స్టాఫ్‌కి జీతాలు చెల్లించాడని తెలిసిందే. అది కూడా లాక్‌డౌన్ సమయంలో గతంలో చెల్లించిన దాని కంటే ఎక్కువగా చెల్లించి, ఇక నుంచి జీతాలు చెల్లించలేనని సుశాంత్ తన సిబ్బందికి స్పష్టం చేసినట్లు తేలింది. 

సుశాంత్ తన సిబ్బందికి జీతాలు ఇచ్చినప్పుడు చెప్పిన మాటల ప్రకారం జీతాలు చెల్లించలేని స్థితిలోకి అతను వెళ్లిపోయాడా లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతోనే సిబ్బందితో ఈ వ్యాఖ్యలు చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఓ వెబ్‌సిరీస్‌లో నటించమని కోరుతూ ఆయన మాజీ మేనేజర్‌ దిశ సుశాంత్‌ తో చర్చలు జరిపినట్టు ప్రస్తుత మేనేజర్‌ పోలీసులకు వెల్లడించాడు. దీంతో పోలీసులు సుశాంత్‌ ఫోన్‌ పరిశీలించారు. అయితే ఆయన మార్చి నెలలో చివరిసారిగా దిశాతో వాట్సాప్‌ చాట్‌ చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే 13 మంది స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. 

More Related Stories