English   

నిహారిక పెళ్లి వెనుక పెద్ద కథే ఉంది.. అప్పట్లో నాగబాబుకు అనుకొని..

Niharika Konidela
2020-06-19 17:32:08

చైతన్య జొన్నలగడ్డ.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో బాగా ఊపేస్తోంది. అసలు ఎవరు ఈ కుర్రాడు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. మెగా ఫ్యామిలీలోకి ఎలా ఎంట్రీ ఇస్తున్నాడు అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. నిహారికకు కాబోయే వరుడు గురించి తెలుసుకోవాలంటే ముందు వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవాలి. అప్పట్లో చిరంజీవి ఈ కుటుంబంతో బంధం కలుపుకోవాలని చూశాడు.. కానీ కుదరలేదు. చైతన్య జొన్నలగడ్డ తండ్రి జొన్నలగడ్డ ప్రభాకర్ గుంటూరు ఐజిగా పని చేస్తున్నారు. ఆ కుటుంబంతో వియ్యం పొందాలని 30 సంవత్సరాల క్రితం చిరంజీవి ప్రయత్నించాడు. ప్రభాకర్ చెల్లెలుతో నాగబాబు పెళ్లి చేయాలని అప్పట్లో చిరంజీవి ప్రయత్నించినా కూడా అది ఎందుకో కుదరలేదు. దాంతో మళ్లీ ఇప్పుడు చిరంజీవి చొరవ తీసుకొని తన కూతురు నిహారిక విషయంలో ఈ సంబంధం సెట్ చేశాడని ప్రచారం జరుగుతుంది.

అప్పుడు మిస్సైన బంధాన్ని ఇప్పుడు కలుపుకున్నాడు. ఈ సంబంధం విషయంలో చిరంజీవి ముందుండి నడిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నయ్య చెప్పిన తర్వాత నాగబాబు ఎదురు చెప్పేది ఉండదు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడని తన కూతురు విషయంలో ముందడుగు వేస్తున్నాడు నాగబాబు. ఆగస్టులో నిశ్చితార్థం డిసెంబర్లో పెళ్లి చేయాలని భావిస్తున్నారు మెగా కుటుంబం. మరోవైపు చైతన్య జొన్నలగడ్డ గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు జనం. నిహారిక కాబోయే భర్త అచ్చం హీరోలా ఉన్నాడు అంటూ పొగిడేస్తున్నారు. 

More Related Stories