English   

సుశాంత్ కెరీర్ తో కరణ్ జోహార్ అంత పెద్ద కుట్ర చేశాడా..

karan johar
2020-06-19 20:07:04

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించిన రోజు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. కానీ మెల్లగా ఒక్కో కారణం బయటికి వస్తుంది. అందులో మరీ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కరణ్ జోహార్. బాలీవుడ్ బడా దర్శక నిర్మాతగా పేరున్న ఈయన కేవలం స్టార్ కిడ్స్ తో మాత్రమే సినిమాలు చేస్తుంటాడు. వాళ్లను మాత్రమే పరిచయం చేయడానికి తన ధర్మ ప్రొడక్షన్స్ వాడుకుంటాడు. అలాంటి వాటిలో చిన్న హీరోలు అసలు నటించలేరు. ఆయన తీసుకోడు కూడా. ఎందుకంటే కరణ్ అంటే ఓన్లీ కేరాఫ్ పెద్ద వాళ్ళు మాత్రమే. బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లకు.. అవుట్ సైడర్స్ కు ధర్మ ప్రొడక్షన్స్ డోర్లు ఓపెన్ చేసుకోవు. అలాంటివి కరణ్ జోహార్ గతేడాది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డ్రైవ్ అనే సినిమా నిర్మించాడు. అప్పటికే చిచోరే లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో సుశాంత్ తో కరణ్ సినిమా చేశాడని అందరూ అనుకున్నారు. కానీ దాని వెనుక పెద్ద కుట్ర ఉందని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమా కోసం సుశాంత్ సింగ్ ను రెండేళ్లపాటు బాగా హింసించాడు కరణ్ జోహార్. అయినా కూడా పెద్ద దర్శక నిర్మాత కదా అని సుశాంత్ అన్ని భరించాడు.

కేవలం డ్రైవ్ సినిమా కారణంగా మరో మూడు నాలుగు సినిమాలు కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తీరా ఇంత చేసి చేసిన సినిమాను థియేటర్లలో కాకుండా డిస్ట్రిబ్యూటర్లు లేరు అనే నెపంతో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసాడు కరణ్. ఈ విషయంలోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆయనతో గొడవపడ్డాడు అని తెలుస్తోంది. అక్కడే కరణ్ జోహార్ ఇగో హర్ట్ అయిందనిమ్ నువ్వు బాలీవుడ్ లో ఎలా ఉంటావో చూస్తాను అని ఆయనతో మాట మాట పెరిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అంత భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా థియేటర్లో కాకుండా.. తనకు నష్టం వస్తుందని తెలిసినా కూడా డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల చేశాడంటే ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకొని కరణ్ జోహార్ ఆడిన గేమ్ అయి ఉంటుంది అంటున్నారు సుశాంత్ సింగ్ అభిమానులు. తమ హీరో కెరీర్ ని నాశనం చేయడానికి కరణ్ జోహార్ మిగిలిన నిర్మాతలతో కలిసి ఇలాంటి కుట్రలు చేశారని వాళ్లు మండిపడుతున్నారు. లేకపోతే చిచోరే లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుశాంత్ సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు లేకపోవడం ఏంటి ప్రశ్నిస్తున్నారు.. దాంతో పాటు మరో ఏడు సినిమాలు సుశాంత్ చేతి నుంచి చేజారిపోవడానికి కారణం కూడా బాలీవుడ్ బడా బాబులు అంటూ మండి పడుతున్నారు.

More Related Stories