English   

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..

Bandla Ganesh.jpg
2020-06-19 22:39:14

టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. నిర్మాతగా అవతారం ఎత్తిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లోనే ఉంటాడు ఈయన. మొన్నటి వరకు రాజకీయాలు.. ఆ తర్వాత విమర్శలు.. ఇప్పుడు అనూహ్యంగా కరోనాతో వార్తల్లోకి వచ్చాడు ఈ నిర్మాత. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్.. ఇప్పుడు ఈయనకు సోకింది. షాద్‌నగర్ వైపు కూడా కరోనా కేసులు బాగానే వస్తున్న తరుణంలో ఇప్పుడు బండ్ల గణేష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తాజాగా చేయించుకున్న టెస్టులో ఈయనకు పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లిన గణేష్‌ను అక్కడ ముందుగా కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు. తీరా చేసిన తర్వాత ఈయనకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దాంతో వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

More Related Stories