English   

సుశాంత్ ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలక ఆధారం..

Sushant Singh
2020-06-20 07:11:27

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కనీసం సూసైడ్ నోట్ కూడా లభించకపోవడంతో అనుమానాస్పద మృతిగా గుర్తించలేదు పోలీసులు. కేవలం ఉరితాడు బిగించుకోవడం వల్లే చనిపోయాడు అంటూ పోస్టుమార్టం రిపోర్టులో కూడా బయటకు వచ్చింది. అయితే ఈయన మరణంపై ముంబై పోలీసులు పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్లకు సుశాంత్ సింగ్ ఇంట్లో కీలక ఆధారం దొరికినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఉరివేసుకున్న అద్దె ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. మిగిలిన ఆధారాలు కూడా దొరకలేదు అని ఇప్పటికే ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఆయన సొంత ఇంట్లో మాత్రం నాలుగైదు పర్సనల్ డైరీలు లభించినట్లు తెలుస్తుంది. 

సుశాంత్ కు డైరీ రాసే అలవాటు ఉందని.. ఆయన పర్సనల్ డైరీలు చూస్తే ఏదైనా ఆధారాలు లభిస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వీటిని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి కేసు మరింత వేగంగా సాగుతుందని వాళ్లు ఆశిస్తున్నారు. కేవలం బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి కారణంగానే సుశాంత్ లాంటి యంగ్ టాలెంటెడ్ హీరో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని కంగనా రనౌత్ స్టార్స్ కూడా బయటికి వచ్చి తమ గళం విప్పి మాట్లాడారు. దాంతో సుశాంత్ ఆత్మహత్యకు కారణమైన వాళ్లను శిక్షించాలని ఆయన అభిమానులు కూడా కోరుతున్నారు. మరి ఇప్పుడు దొరికిన డైరీలలో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. 

More Related Stories