English   

సుశాంత్ సింగ్ సూసైడ్ ఎఫెక్ట్.. కరణ్ జోహార్ సంచలన నిర్ణయం..

Karan Johar
2020-06-20 07:21:46

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అందరి కంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్న కరణ్ జోహార్ ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బాలీవుడ్ లో ఏదో ఒక సిండికేట్ ఏర్పాటు చేసి కొత్తవాళ్లను రాకుండా న్యూ టాలెంట్ అడ్డుకుంటున్నారని.. బయటి నుంచి వచ్చిన వాళ్ళని ఎదగనీయకుండా చాలా చేస్తున్నాడు అంటూ ఈ మధ్య చాలామంది మండి పడుతున్నారు. ఇలాంటి వాళ్లు అసలు ఇండస్ట్రీలో ఉండకూడదని.. వాళ్లకు తగిన శిక్ష వేయాలి అంటూ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీలో కూడా కంగనా రనౌత్, శేఖర్ కపూర్ లాంటి లెజెండ్స్ అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి అభిమానులకు చెప్పారు. దాంతో కరణ్ జోహార్, ఆలియా భట్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా బన్సాలి ఇలా చాలామందిపై ఇప్పుడు విమర్శలు రేగుతున్నాయి. వీళ్లే బాలీవుడ్ ను హస్తగతం చేసుకొని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అని.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వాళ్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. 

మరోవైపు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న నటులను తొక్కడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఏ మాత్రం టాలెంట్ లేని పనికిమాలిన వారసులను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి వీళ్లు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి సందర్భంలో కరణ్ జోహర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన సోషల్ మీడియా పేజీలో కేవలం 8 మందిని మాత్రమే ఫాలో అవుతూ మిగిలిన వాళ్ళందర్నీ అన్ ఫాలో చేశాడు. అందులో ఆలియా భట్, సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి వారసులు కూడా ఉన్నారు. కేవలం షారుక్ ఖాన్, పీఎం నరేంద్ర మోడీ, ఆయన స్టాఫ్ ఒక నలుగురు.. వీళ్లను మాత్రమే ఫాలో అవుతున్నాడు. కరణ్ ఈయన తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తి రేకెత్తిస్తుంది.

More Related Stories