English   

సుశాంత్ సింగ్ పెంపుడు కుక్కను చూస్తుంటే కన్నీరు ఆగడం లేదు..

Sushant Singh
2020-06-20 07:59:26

ఈ రోజుల్లో మనుషుల కంటే జంతువులు ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాయి. మనుషుల ప్రేమలో కుళ్ళు కుతంత్రాలు స్వార్థం ఉంటాయేమో కానీ జంతువులకు ఏమి తెలియదు. అవి కల్మషం లేని ప్రేమ అందిస్తుంటాయి. ఇక తమను ప్రేమించే వాళ్ళు దూరమైతే అవి పడే మూగ రోదనకు అంతే ఉండదు. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పెంపుడు కుక్క ఫుడ్జ్ విషయంలో ఇదే జరుగుతుంది. ఈ అరుదైన జాతి కుక్కను సుశాంత్ కొన్నేళ్లుగా పెంచుకుంటున్నాడు. దాని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు. అయితే కొన్ని రోజుల కింద ఈయన తన ప్రాణం తీసుకున్నాడు. ప్రతిరోజు సుశాంత్ తో ఆడుకున్న ఈ కుక్క ఇప్పుడు ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతోంది. 

సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ సిబ్బంది పోస్ట్ చేస్తున్న కుక్క వీడియోలు చూస్తుంటే కన్నీరు ఆగడం లేదు. ఏ తలుపు చప్పుడు అయినా కూడా సుశాంత్ వచ్చాడేమో అని అదే ఆశగా వెళుతుంది. తీరా ఆయన కనిపించకపోయేసరికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుశాంత్ సింగ్ గది బయట అలాగే నేలపై పడుకుండిపోతుంది ఈ కుక్క. ఆయన చనిపోయిన తర్వాత అతడి కోసమే వేచి చూస్తూ అలాగే మౌనంగా రోదిస్తుంది ఈ మూగ జీవం. తిండి తినకుండా నీళ్లు తాగకుండా యజమాని కోసం వేచి చూస్తుంది. పాపం ఆయన రాడని ఈ మూగ జీవికి ఏం తెలుసు. దాన్ని మళ్లీ నార్మల్ చేయాలని సుశాంత్ సింగ్ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా కూడా అది సాధ్యం కావడం లేదు. ఇలాగే ఇంకా కొన్ని రోజులు ఉంటే అది కూడా తన యజమాని దగ్గరికి వెళ్లి పోతుందేమో అని భయపడుతున్నారు వాళ్ళు. ఏదేమైనా ఈ పెంపుడు కుక్క బాధను చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 

More Related Stories