English   

కరీనా కపూర్ తో ఆడుకుంటున్న సుశాంత్ సింగ్ అభిమానులు..

 Kareena Kapoor
2020-06-20 08:07:09

ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన గురించి ఎక్కువగా తెలుసుకుంటారు ప్రేక్షకులు. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆయన బ్రతికి ఉన్నప్పుడు కేవలం ఆయన సినిమాలను మాత్రమే అభిమానించారు. అయితే ఆయన చనిపోయిన తరువాత లెజెండ్ అయిపోతున్నాడు. ఓ టాలెంటెడ్ హీరోను అందరూ కలిసి బలవంతంగా చంపేశారు అంటూ బాలీవుడ్ పెద్దలపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కరీనా కపూర్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దానికి కారణం కూడా ఉంది. కరణ్ జోహార్ షోలో భాగంగా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ తో సహా ఒకప్పుడు వచ్చింది కరీనా. ఇప్పుడు ఆ పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. 

అందులో సారా అలీ ఖాన్ ను డేటింగ్ కి వెళ్ళమని చెబితే ఏ హీరోతో వెళ్ళమంటారు అంటూ కరణ్ అడిగాడు. దానికి ఏ మాత్రం తడుముకోకుండా మీ మొదటి సినిమా హీరోతో మాత్రం వెళ్లొద్దు అని చెప్తానని కరీనా చెప్పింది. సారా మొదటి హీరో సుశాంత్ సింగ్. కేదార్ నాథ్ సినిమాతో సారా అలీ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కరీనా చెప్పిన సమాధానంతో ఇప్పుడు అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాదు సుశాంత్ మొహం పరమ చెత్తగా ఉంటుంది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరూ కలిసి ఒక అద్భుతమైన నటుడిని చచ్చిపోయేలా చేశారు.. మీ సినిమాలు మేము చూడము అంటూ సోషల్ మీడియాలో అందర్నీ బాయ్ కాట్ చేస్తున్నారు. ఇదే లిస్ట్ లో కరీనా కపూర్ కూడా చేరిపోయింది. 

More Related Stories