English   

సుశాంత్‌కు ఆ బడా నిర్మాత వార్నింగ్..నువ్వు ఆత్మహత్య చేసుకుంటావ్..

sushanth
2020-06-20 08:25:27

సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ మొత్తాన్ని కుదిపేస్తోంది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ మరణించాడని పోలీసులు చెబుతున్నా ఆ నింద మాత్రం బాలీవుడ్ మీద పడుతోంది. సినీ అవకాశాలు దూరం చేయడంతోనే సుశాంత్ మరణించాడని కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటి సినీ పెద్దలపై రెండ్రోజుల నుండి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక అడ్వొకేట్ అయితే కేసు కూడా వెశారు. అయితే ఇప్పుడు ఫోకస్ అంతా మహేష్ భట్‌ మీద పడింది. ఎందుకంటే సుశాంత్ మృతి వెనుక మహేష్ భట్ ప్రమేయం ఉందని నెటిజన్లు కొత్త లాజిక్ తెర మీదకు తెచ్చారు. ఎందుకంటే రియా చక్రవర్తితో సుశాంత్ ప్రేమలో ఉన్నాడు, అయితే అనతకు ముందు ఈమె మహేష్ భట్ తో సన్నిహితంగ ఉండడమే ఈ మరణానికి కారణమని నెటిజన్స్ ఆరోపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సుశాంత్ మరణం వెనుక వీరిద్దరి పాత్ర ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అందుకు మహేష్ భట్ తన కూతురితో లిప్ లాక్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మహేష్ భట్ కామాంధుడని, ఒకవేళ పూజా తన కూతురు కాకపోయి ఉంటే పెళ్లి చేసుకునే వాడినని చెప్పిన కామెంట్లను ప్రస్తుతం నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. నువ్వు నాతో ఉంటే మహేష్ భట్ నన్ను చంపేస్తాడని రియాతో సుశాంత్ చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మహేష్ భట్ కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పిన సంగతి ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

More Related Stories