English   

పవన్ నిర్మాతలకి భారీ నష్టం...కోట్ల రూపాయల సెట్ ధ్వంసం

Pawan
2020-06-20 10:23:40

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వరుసగా మూడు సినిమాలు ఒప్పుకున్నారు. ఒకటి పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఉండగా, మరొకటి టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ జాగ‌ర్లమూడితో ఒక పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. ఇక మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మూడూ పెద్ద సంస్థలే తెరకేక్కిస్తున్నాయి. ఈ మూడిటిలో పవన్- విరూపాక్ష సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది పీరియాడిక్ సినిమా. అప్పటి పరిస్థితులను మళ్ళీ సృష్టించాల్సి వస్తుంది. అయితే ఈ సినిమాని ఒకప్పటి భారీ సినిమాల నిర్మాత ఎఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి రాక‌ముందే కోలుకోలేని దెబ్బ ప‌డింది. ఈ ఏడాది జనవరిలో ఫార్మ‌ల్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న‌ ఈ చిత్రాన్ని  పవన్ వకీల్ సాబ్ పూర్తైన త‌ర్వాత సెట్స్ పైకి తీసుకెళ్ళాలి అనుకున్నారు. 

అయితే కరోనా దెబ్బకు రెండు సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. అయితే ఇక్కడే మరో భారీ దెబ్బ పడింది విరూపాక్ష మేకర్స్ కి.  అదేంటంటే ఈ సినిమా కోసం నగరంలోని అల్యూమినియం కర్మాగారంలో భారీ ఓడ సెట్‌ ను నిర్మించారు.  స‌హ‌జంగా స‌ముద్రాన్ని బ్రమింప చేసేలా ఒక కొలను ఏర్పాటు చేసి అందులో ఓడ సెట్ కూడా వేశార‌ట‌. ఎన్నో ప్రత్యేక‌ల‌తో సెట్‌ని రూపొందించిన‌ట్టు చెబుతున్నారు. అయితే వీరి కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని అంటున్నారు. ఎందుకంటే తాజాగా కురిసిన భారీ వ‌ర్షం వ‌ల‌న సెట్ అంతా పూర్తిగా ధ్వంస‌మైన‌ట్టు తెలుస్తుంది. సెట్ ని ఇప్పుడు షూట్ కోసం ఉపయోగించలేని స్థితి నేలకొందట. ఇప్పటికే లాక్ డౌన్ కార‌ణంగా మేకర్స్‌కి ఇప్పటికే కోలుకోలేని న‌ష్టం జ‌రుగ‌గా, తాజాగా కురిసిన వ‌ర్షంతో ప్రొడ‌క్షన్ సంస్థ కి భారీ న‌ష్టాలు ఏర్పడినట్టు చెబుతున్నారు. 

More Related Stories