English   

ఆ హీరో మరో సినిమా కూడా ఓటీటీలోనే 

Satyadev
2020-06-20 10:58:02

తెలుగులో అండర్ రేటెడ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారా ? అంటే చాలా మంది అసలు ఆలోచించకుండా చెప్పేసే పేరు సత్య దేవ్ కంచరాన. ఎప్పుడో సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు సినిమా నుండే సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ నటుడు బ్లఫ్ మాస్టర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఈ మధ్య వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ డిజిటల్ లో తెలుగు కంటెంట్ ని పుష్ చేస్తూ వస్తున్నాడు. ఈయన హీరోగా తెరకెక్కుతున్న ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. కరోన కారణంగా థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేని కారణంగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సత్యదేవ్ నటించిన ఈ సినిమాతో పాటు మరో సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. సత్యదేవ్ హీరోగా నటించిన 47 రోజులు అనే చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతుంది. అయితే ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య సినిమాని నెట్ ప్లిక్స్ లో విడుదల చేయనుండగా 47 రోజులు సినిమాను జీ5 యాప్ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఆ సినిమా యూనిట్ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నెల 30న 47 డేస్ సినిమాని జీ5 లో విడుదల చేయబోతున్నట్లుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

More Related Stories