English   

అదే నిజమైతే మహేష్ కి పెద్ద బ్రేక్ 

Mahesh Babu
2020-06-20 18:35:42

సాధారణంగా సినిమా స్టార్స్ తమ కెరీర్స్ నుండి బ్రేక్ తీసుకోవడం చాల ఆరుదుగా జరుగుతూ ఉంటుంది. నా పేరు సూర్య తర్వాత బన్నీ, శ్రీనివాస కళ్యాణం తరువాత నితిన్. ఇలా ఒక భారీ ఫ్లాప్ తర్వాత విరామం తీసుకోవడం మన వాళ్ళకి పరిపాటే. అప్పట్లో కూడా మహేష్ బాబు ఎంతో ఇష్ట పడి చేసిన అతిథి సినిమా బాక్సాపీస్‌ వద్ద భారీగా బోల్తా పడింది. దీంతో ఆయన ఏడాదికిపైగా విరామం తీసుకుని సినిమా చేశారు. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ఆరోజు నుండీ ఆయన చిన్న చిన్న బ్రేక్స్ తీసుకున్నాడు కానీ పెద్దగా ఏదీ ప్లాన్ చేయలేదు. 

కానీ ఆయన హీరోగా వచ్చిన చివరి సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తర్వాత మహేశ్‌ దాదాపు షూటింగ్‌కు దూరమయ్యాడనే చెప్పాలి. ఇప్పటికే మహేశ్‌ బ్రేక్‌ తీసుకుని ఆరు నెలలు అవుతుంది. మళ్లీ షూటింగ్‌లో పాల్గొనాలంటే కరోనా కారణంగా మరో 6 నెలలు పట్టే అవకాశముందని అంటున్నారు. డిసెంబర్‌ వరకు మహేశ్‌ బాబు షూటింగ్‌ చేయలేనని చెప్పెసినట్టు ప్రచారం జరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహేశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇది కనుక నిజమే అయితే మహేష్ తన కెరీర్‌లో తీసుకున్న రెండో పెద్ద ఇదే అవుతుందని అంటున్నారు.  

More Related Stories