English   

బండ్లకి కరోనా..శౌర్య ఫ్యామిలీతో సహా షిఫ్టింగ్

Naga Shourya
2020-06-21 09:00:16

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ రావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బహుశ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట కరోనా వచ్చిన మనిషి ఆయనే అని చెప్పచ్చు. ఆయనకు కరోనా రావడం మీడియాలో వచ్చినా తనకు లేదని చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా అది నిజం కాదని, ఆయనకీ నిజం గానే కరోనా సోకిందని తేలింది. అయితే బండ్లకు కరోనా సోకడంతో ఇప్పుడు టాలీవుడ్ అలర్ట్ అయింది. గత రెండు మూడు రోజులుగా కలిసిన వారు కూడా కరోనా బారిన పడినట్లు చెబుతున్నారు. తనకు కరోనా సోకిందని తెలియక చాలా మందిని కలిశాడట బండ్ల. దాంతో ఆయనకు కొద్దిరోజులుగా కాంటాక్ట్ ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకుంటున్నారు. 

బండ్ల గణేష్ ఉండే వీధిలోనే నాగశౌర్య కూడా ఉంటున్నాడు. దాంతో దాంతో ఆయనకు కూడా కరోనా భయం పట్టుకుందని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అంతే కాదు బండ్లతో కాంటాక్ట్ ఏవీ లేకున్నా ముందస్తు జాగ్రత్తతో శౌర్య ఫ్యామిలీ అక్కడి నుంచి వేరే చోటకు షిప్ట్ అయిపోయారని అంటున్నారు. అపోలో లేదా కాంటినెంటల్ హాస్పిటల్‌ లో చికిత్స కోసం చేరనున్నానని బండ్ల చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్‌ లో ఉన్నాడు బండ్ల. ఈ మధ్య హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా అక్కడి డాక్టర్ కరోనా టెస్ట్‌ కూడా కలిపి చేయించారు. అక్కడ ఆయనకు పాజిటివ్ అని తేలింది.  

More Related Stories