English   

పెళ్లి రోజున పచ్చడన్నంతో గడిపేసిన చరణ్ ఉపాసనలు

Ram Charan
2020-06-21 16:29:32

రామ్ చరణ్ ఉపాసనల పెళ్ళయి ఎనిమిదేళ్ళు పూర్తయింది. మొన్న జూన్ 14 వారి వివాహ వార్షికోత్సవం. అయితే మామూలుగా అయితే వీరు తమ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఘనంగానే జరుపుకునే వారు. కానీ ఈ ఏడాది వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబంలో సంభవించిన మరణాలు అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం, అలాగనే ఈ కరోనా మహమ్మారి కారణంగా జరుపుకోలేదు. ఘనంగా వార్షికోత్సవాన్ని జరుపుకోడానికి బదులుగా, ఈ జంట బంగాళాదుంప చిప్స్‌, ఆవకాయ పచ్చడన్నంతో భోజనం చేసి, టెలివిజన్ చూసి గడిపేశారు. 

ఈ విషయాన్ని వార్షికోత్సవం జరిగిన ఆరు రోజుల తరువాత, ఉపాసన తన ఇన్‌స్టా గ్రామ్‌ లో పంచుకుంది. "సరిగ్గా ఒక వారం క్రితం మా 8 వ వివాహ వార్షికోత్సవం వచ్చింది, కానీ మా ఇద్దరికీ జరుపుకునే మూడ్ లేదు. మేము చిప్స్‌ తో మూడు రకాలైన అవకాయ పచ్చడి అన్నం తిని టీవీ చూశాము, ఒక మరపురాని పాఠం నేర్చుకున్నాము”అని ఉపాసన పోస్ట్ చేసింది. ఇక చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూ, తన తండ్రి చిరు హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా చూస్తున్నాడు. జక్కన్న షూట్ మొదలు పెడతాడేమో అని ఆత్రుతగా ఉన్నాడు చరణ్.  

More Related Stories