English   

ప్రవీణ్ సత్తరు దర్శకత్వంలో నాగార్జున 

 Akkineni Nagarjuna
2020-06-22 07:25:18

‘మన్మథుడు 2’ సినిమా లాంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అనే కాప్ ఓరిఎంటెడ్  మూవీకి కమిట్ అయ్యాడు. మహర్షి సినిమాకి రచయితగా పని చేసిన సాల్మన్ అనే వ్యక్తిని ఈ సినిమా సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. విజయ వర్మ అనే ఒక ఎన్ఏఐ ఆఫీసర్ జీవిత కథనే సినిమాగా మలుస్తున్న ఈ సినిమా షూట్ కూడా దాదాపుగా కంప్లీట్ కావొచ్చింది. ఇంతలో కరోనా రావడంతో ఆ సినిమా షూట్ చివర్లో ఆగింది. ఇక ఇప్పుడు నాగ్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ని త్వరలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. 

ఈ సినిమాని  అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఆ విషయం పక్కన పెడితే ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడని అంటున్నారు. ఇది ఒక ఇన్విస్టిగేటివ్ జానర్ సినిమా అని అంటున్నారు. ఈ సినిమాని నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత శరత్‌ మారార్‌ నిర్మించనున్నాడని అంటున్నారు. ఇక ప్రస్తుతానికి ప్రవీణ్‌ ప్రవీణ్‌ బ్యాడ్మింటన్‌‌‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవితాధారంగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సుధీర్‌ బాబు నటిస్తున్నాడు. బంగార్రాజు-గోపీ చంద్ సినిమాలు పూర్తి అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుందని చెబుతున్నారు.

More Related Stories