English   

దీపిక నువ్వు కూడా సుశాంత్ చావును వాడుకుంటున్నావా..

Deepika Padukone
2020-06-22 07:34:46

సోషల్ మీడియాలో అభిమానులు దీపికా పదుకొనేను ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఒకవైపు బాలీవుడ్ అంతా నెపోటిజంతో నిండిపోయింది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి సమయంలో దేశమంతా అభిమానులు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సందర్భంలో దీపికా పదుకొనే గత మూడు నాలుగు రోజులుగా ట్విట్టర్లో ఓకే పోస్ట్ మళ్లీమళ్లీ పెడుతుంది. అదే డిప్రెషన్ కు సంబంధించి. గతంలో తాను కూడా ఒకానొక సందర్భంలో డిప్రెషన్కు లోనయ్యానని.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని ఆమె చెప్పుకొచ్చింది. సుశాంత్ విషయం ఒక్కటే కాదు చాలామంది మంది కూడా తన జీవితంలో డిప్రెషన్ ఎదురైనప్పుడు చావును వెతుక్కుంటూ వెళుతున్నారని దీపిక ట్వీట్ చేసింది. అది సరైన మార్గం కాదని.. సమస్యకు చావు మాత్రమే పరిష్కారం కాదని ఈమె చెబుతోంది. 

ఈ క్రమంలోనే రోజు డిప్రెషన్ కు సంబంధించిన కొన్ని కొటేషన్లు ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది దీపికా పదుకొనే. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై మండి పడుతున్నారు. ఒకరోజు అంటే ఓకే.. రెండు రోజులు అంటే పర్లేదు.. కానీ ప్రతిరోజు ఈ డిప్రెషన్ కు సంబంధించిన పోస్టులు పెడుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చావును కూడా నువ్వు క్యాష్ చేసుకుంటున్నావా దీపిక అంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికైనా ఈ పోస్టులు చేయడం ఆపండి అంటూ ఆమెను కోరుతున్నారు. నిజంగానే బాలీవుడ్ లో సుశాంత్ చనిపోయిన తర్వాత చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన చావును వీళ్లు క్యాష్ చేసుకుంటున్నారు అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. బతికున్నప్పుడు ఎవరూ పట్టించుకోని వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చే మొసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. 

More Related Stories