English   

రానా సమర్పణలో కృష్ణ అండ్ హిజ్ లీలా...అనుకున్న దానికంటే ముందే 

Krishna And His Leela
2020-06-22 13:19:52

ఆరోగ్య సమస్యలతో చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న యంగ్ హీరో రానా దగ్గుబాటి అనుకోకుండా పెళ్లి ప్రకటన చేసి లైం లైట్ లోకి వచ్చేశాడు. కొన్నాళ్లుగా ఆయన, ఆయన పెళ్లి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అయితే ఆయన సినిమాల విషయానికి వస్తే ఆయన నటించిన హాథీ మేరీ సాథీ సినిమా(తెలుగులో అరణ్య) షూటింగ్ పూర్తి అయిపొయింది. ఈ కరోనా లేకుంటే ఏప్రిల్ లోనే విడుదల కావలసి ఉంది. మరోపక్క ఆయన చేస్తున్న విరాటపర్వం సినిమా కూడా షూట్ పూర్తి కావొచ్చింది. ఇక గుణశేఖర్ హిరణ్య కశ్యప కూడా షూట్ కి వెళ్ళాల్సి ఉంది. ఒక పక్క నటుడిగా బిజీగా ఉన్న అయన నిర్మాతగా నాన్న వారసత్వాన్ని అంది పుచ్చుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కేరాఫ్ కంచరపాలెం లాంటి డిఫరెంట్ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించి హిట్ అందుకున్న ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌ ను గత ఏడాది చివర్లో ఎనౌన్స్‌ చేశాడు.

అడవి శేష్‌ హీరోగా క్షణంలాంటి ఇంట్రస్టింగ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. రానా సమర్పణలో సురేష్ ప్రొక్షన్స్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, సంజయ్‌ రెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాను నిజమైన పుకారు ఆధారంగా తెరకేక్కిన్చినట్టు చెబుతున్నారు. చాలా భాగం లడక్‌లో చిత్రీకరించనున్న ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డ లీడ్‌ రోల్‌లో నటించగా, నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి హీరో లుక్‌ విడుదల చేశారు. ఈ లుక్ లో కారు బానేట్ మీద కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు హీరో సిద్దూ. పుకార్లు ఇక చాలు, అసలు కధ మీరు ఊచించిన దాని కంటే వేగంగానే వచ్చేస్తోంది అంటూ రానా తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు.

More Related Stories