English   

వర్మ మరో సెన్శేషన్...అప్పుడు కాక ఇప్పుడెందుకు 

RGV Amrutha Maruthi Rao
2020-06-22 13:41:43

తెలంగాణాలోనే కాక దేశ వ్యాప్తంగా సృష్టించింది, మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య. తన కూతురు తక్కువ కులం వాడిని చేసుకుందనే కోపంతో అగ్రకులానికి చెందిన ఒక తండ్రి, కూతురు ప్రెగ్నెంట్ గా ఉన్న సమయాన అల్లుడిని సుపారీ ఇచ్చి చంపించాడు. ఈ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. , ఆ తర్వాత కొద్దిరోజులకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడే దీని మీద వర్మ సినిమా తీస్తాడని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు సైలెంట్ గా ఉన్న వర్మ, నిన్నటి ఫాదర్స్ డే ని ఈ సినిమా అనౌన్స్ చేసేందుకు వాడుకున్నాడు. నిన్న మధ్యాహ్నం అమృత, మారుతి రావుల నిజ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ట్విటర్లో  ప్రకటించారు. దానికి నిన్న సాయంత్రం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. 

మర్డర్ అనే టైటిల్‌తో వస్తున్న  ఈ చిత్రానికి 'కుటుంబ కథా చిత్రమ్‌' అనేది ఉప శీర్షిక. వర్మ స్కూల్ కి చెందిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మారుతీరావు పాత్ర పోషిస్తుండగా, అమృత పాత్ర వేరే ఎవరో అమ్మాయి చేత చేయిస్తున్నారు. రామ్‌గోపాల్‌ వర్మ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు నట్టి కరుణ, నట్టి  క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ఆనంద్‌ చంద్ర అనే వర్మ స్కూల్ లో దర్శకత్వం నేర్చుకున్న ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. అయితే వర్మ ఈ సినిమా అనౌన్స్ చేయడం వలన మిశ్రమ స్పందన వస్తోంది. అసలు ఈయన సినిమా అప్పుడు కాకుండా ఇప్పుడు అనౌన్స్ చేయడంలో ఉద్దేశం ఏంటని ? ఫాదర్స్ డే రోజున అనౌన్స్ చేశారు కాబట్టి మారుతి రావుని హీరోని చేసి చూపించే ప్రయత్నం జరగచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More Related Stories