English   

వర్మ మీద అమృత ఫైర్..రెస్ట్ ఇన్ పీస్ వర్మా అంటూ 

 Amrutha
2020-06-22 13:54:16

యథార్థ కథలు బేస్ చేసుకుని సినిమాలు తీయడం అలవాటు చేసుకున్న వర్మ. ఈసారి మిర్యాలగూడ ప్రణయ్, అమృతల ప్రేమ వ్యవహారం, మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంలో మర్డర్ అనే పేరుతో సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫాదర్స్ డే సంధర్భంగా వర్మ మర్డర్ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ విడుదల నేపధ్యంలో అమృత వర్మ మీద ఫైర్ అయ్యారు. పోస్టర్ ఫస్ట్ లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని, ప్రేమించిన వ్యక్తికి, కన్న తండ్రికి దూరమైన తన జీవితం తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పా? అని ఆమె ప్రశ్నించారు.

‘మిస్టర్ వర్మ.. మీకు ఆడవాళ్ల గౌరవం గురించి చెప్పే తల్లి లేనందుకు చింతిస్తున్నాను. రెస్ట్ ఇన్ పీస్” అని పేర్కొన్నారు. ‘‘వర్మ చేసిన ప్రకటనతో మళ్లీ మా జీవితంలో అలజడి మొదలైంది. నా భర్త ప్రణయ్ హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు మేము భయం భయంగానే బతుకుతున్నాం, ఇప్పుడు మా జీవితాన్నే సినిమాగా తీస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించడం మా జీవితాల్లోకి కొత్త సమస్యగా మారిందని చెప్పుకోచ్చంది. ఇక వర్మపై తాను కేసు పెడితే మళ్లీ అది ఆయనకే పబ్లిసిటీ అవుతుందని అందుకే కేసు కూడా పెట్ట దలచుకోలేదని ఆమె పేర్కొన్నట్టు ఒక ప్రెస్ నోట్ మీడియాకి అందింది.

More Related Stories