మోడీ మీద విరుచుకుపడ్డ కమల్

జూన్ 15 న లడఖ్ వద్ద భారత సైనికులపై చైనా అప్రజాస్వామిక దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కి చైనా వెన్నుపోటు పొడిచి చంపినట్లు కమల్ హాసన్ పేర్కొన్నారు. ఆ ఫలితంగానే 20 మంది ధైర్యవంతులు మరణించారని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నరేంద్ర మోడీ ఇతర ప్రధానుల కంటే నాను ఎక్కువగా సందర్శించారన్న ఆయన మహాబలిపురం శిఖరం దౌత్యపరమైన విజయమని పేర్కొన్నారని అన్నారు. చైనా మన భూ భాగాన్ని ఆక్రమించలేదని, మన పోస్ట్‌ను స్వాధీనం చేసుకోలేదని అఖిలపక్ష భేటీలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించిన వారిపై వక్రీకరణ చేస్తున్నారని ప్రచారం చేయడం పట్ల కమల్ ఈ విధంగా స్పందించారు.
ప్రభుత్వం తన ప్రకటనలతోనే ప్రజల్ని భావోద్వేగపూరిత పద్ధతుల్లో తప్పుదారిపట్టిస్తోందని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ప్రచారం మానుకోవాలని ప్రధానితో పాటు ఆయన మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నానని కమల్ ఘాటుగానే పేర్కొన్నారు. ప్రశ్నించేవారిని జాతివ్యతిరేకులుగా చిత్రించడం సరికాదని, ప్రశ్నించడం ప్రజాస్వామిక హక్కని కమల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆల్ పార్టీ మీటింగ్ ముగిసిన తర్వాత ప్రతిపక్షాల విమర్శలు ఎక్కువ అయ్యాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మాటలను వక్రీకరిస్తున్నారని పీఎంఓ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అదే ఈ విమర్శలను ఎక్కువ చేసింది.