నయన్, విజ్ఞేశ్ లకు కరోనా...క్లారిటీ ఇచ్చిన విజ్ఞేశ్

గత రెండు నెలలుగా మీడియాలో ఎక్కడ చూసినా కరోనా వార్తలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో పలువురికి కరోనా పాజిటివ్ అంటూ మీడియా కంటే ముందే సోషల్ మీడియాలో రకరకాలు వార్తలు దర్శనమిస్తున్నాయి. వాటిని బేస్ చేసుకుని మీడియా కూడా అలాంటి వార్తలు ప్రసారం చేస్తోంది. అయితే అందులో కొన్ని నిజమె కాగా మరికొన్ని ఏమో అసలు బేస్ లెస్, తాజాగా నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్‌లకు కరోనా పాజటివ్‌గా తేలిందని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో వారి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ క్రమంలో ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు విఘ్నేశ్ స్పందించారు.
తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని పేర్కొంటూ ఓ ప్రత్యేక వీడియోను తన సోషల్ media అకౌంట్ లో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో నయన్, విఘ్నేశ్ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే అంతకు ముందే నయన్ అధికార ప్రతినిధి స్పందించారు. నయన్, విఘ్నేశ్‌లకు కరోనా సోకిందనే వార్తలను ముందేఖండించారు. వారిద్దరు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. అభిమానులు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు. దీంతో నయన్, విఘ్నేశ్‌లకు కరోనా సోకిందని జరగుతున్న ప్రచారంలో వాస్తవం లేనట్టే.