English   

అయ్యప్ప దీక్షలో అఖిల్

akhil
2020-06-22 18:07:34

అయ్యప్ప దీక్ష గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సాధారణంగా ఈ దీక్షను కార్తీక మాసంలో ఎక్కువగా ధరిస్తారు తెలుగు రాష్ట్రాల వాళ్ళు. అయితే మన హీరోలు కూడా అయ్యప్ప దీక్ష ధరిస్తూ ఉంటారు. పెద్దల విషయానికి వస్తే మురళీ మొహన్, ఇక హీరోల విషయానికి వస్తే మంచు మనోజ్, రామ్ చరణ్, శర్వానంద్ లాంటి హీరోలు కూడా ధరిస్తూ ఉంటారు. హీరోలు ఎప్పుడు చూసినా చాలా స్టైలిష్ లుక్స్ తో చాలా ట్రెండీగా కనిపించాలి. అలా కనిపిస్తేనే ప్రేక్షకులు వారిని హీరోలుగా గుర్తిస్తారు. కాబట్టే సినిమాల్లో అలానే బయట కూడా తెలుగు హీరోలు డీ గ్లామర్ గా కనిపించేందుకు అస్సలు ఆసక్తి చూపించరు. అయితే తాజాగా యంగ్ హీరో అఖిల్ అయ్యప్ప దీక్ష చేపట్టాడని అంటున్నారు. ఎటూ లాక్ డౌన్ పీరియడ్ కాబట్టి ఇంకేమీ పనులు చేయలేమని భావించి ఈ సమయాన్ని ఆధ్యాత్మిక వికాసం కోసం వాడుతున్నాడని అంటున్నారు. అఖిల్ దీక్ష తీసుకున్న ఫొటోలు అయితే బయటకు రాలేదు. కాని ఒక ఫొటో మాత్రం సన్నిహితుల ద్వారా బయిటకొచ్చింది.  

More Related Stories