English   

నాని సినిమా కోసం పరిశీలనలో ఆరుగురు హీరోయిన్స్ 

nani
2020-06-23 13:17:37

నాచురల్ స్టార్ నాని తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అనే టైటిల్ తో ఈ సినిమాని టాక్సీవాలా ఫేం దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నానికి 27వ సినిమా. పీరియాడికల్ మూవీగా చెబుతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా కధ కోసం నాని ఏకంగా 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు కొన్నట్టుగా చెబుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్స్ పై రోజుకో వార్త వస్తుంది. 

లాక్ డౌన్ ముందే సాయి పల్లవి పేరు తెర మీదకు వచ్చింది. తాజాగా ఈ సినిమా కోసం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న పేరు కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా మరో హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో కూడా నాని మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడని అందుకే ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉండొచ్చని అంటున్నారు. రష్మిక మందన్న, రాశీ ఖన్నా, సాయిపల్లవి, నివేథా ధామస్, నిధి అగర్వాల్, రీతూ వర్మల పేర్లు అనుకున్నారని ఇందులో ముగ్గురిని ఫైనల్ చేయనున్నారని అంటున్నారు.  

More Related Stories