English   

స్లిమ్ గా మారిన లేడీ కమెడియన్..హీరోయిన్ గా ఏమైనా ట్రై చేస్తోందా 

Vidyulleka Raman
2020-06-23 13:59:35

తెలుగు, తమిళ భాషల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది విద్యుల్లేఖ. హీరోయిన్ స్నేహితురాలిగా ఎన్నో సినిమాల్లో టాప్ హీరోయిన్స్ తో జత కట్టిన ఈమె  సోలోగా కూడా ఎన్నో సినిమాల్లో టాప్ కమెడియన్లతో నటించి తనకంటూ సొంత ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే విద్యుల్లేఖ లావుగా ఉండటంతో పాటు ఆమె కామేడీ టైమింగ్ కి బాగా కలసి వొచ్చింది. లావుగా ఉంటుందన్న మాటే కానీ ఆమె అందం కూడా తక్కువేమీ కాదు. ఇటీవల విద్యుల్లేఖ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరికి షాకిచ్చేలా ఉన్నాయి. బాగా బరువు తగ్గి సన్నజాజిలా మారింది ఈమె. 

ఎప్పుడో రెండేళ్ళ క్రితం పిక్ ఇప్పటి పిక్ కంపేర్ చేస్తూ షేర్ చేసింది. ఎప్పుడో టెంత్‌ క్లాస్‌లో ఉన్నప్పుడు 68 కేజీలు ఉన్నాననీ, మళ్లీ ఇన్నాళ్ళకు 65 కేజీలకు వచ్చానని విద్యుల్లేఖ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. వెయిట్‌ లాస్‌కి సీక్రెట్స్‌ మందులు, బిళ్లలు లేవనీ వారంలో ఆరు రోజులు వర్కవుట్లు చేస్తూ డైట్‌ మెంటైన్‌ చేయడమేనని విద్యుల్లేఖ చెబుతోంది. విద్యుల్లేఖ స్లిమ్ గా మారిపోవడంతో హీరోయిన్ ఛాన్సుల కోసం ఏమైనా ట్రై చేస్తుందా అని టాలీవుడ్ లో గుస గుసలు కూడా వినిపిస్తున్నాయి.

More Related Stories